మార్స్‌‌‌‌పై మూడు రోజులుంటరా?

స్పెయిన్‌‌‌‌కి ఉత్తర తీరంగా అర్రెడోండో  మున్సిపాలిటీలో  ‘కాంటాబ్రియా’ అనే అటానమస్‌‌‌‌ ప్రాంతంగా ఉంది.   ఈ ప్లేస్‌‌‌‌లో పచ్చని కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో రిసార్ట్స్‌‌‌‌ ఉన్నాయి.  సమ్మర్‌‌‌‌లో దేశవిదేశాల నుంచి టూరిస్టులు ఈ ప్లేస్‌‌‌‌కి ‘క్యూ’  కడుతుంటారు.  ఇక్కడ ఉండే అస్ట్రోల్యాండ్‌‌‌‌ అడ్వెంచర్‌‌‌‌ క్లబ్‌‌‌‌ రీసెంట్‌‌‌‌గా ఒక ఈవెంట్‌‌‌‌ మొదలుపెట్టింది.  టూరిస్టులకు ‘మార్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్’ అందిస్తోంది.  ఇందు కోసం కాంటాబ్రియా గుహల్లో మార్స్‌‌‌‌ గ్రహం మీద ఉన్నట్లే వాతావరణాన్ని,  పరిస్థితులను  క్రియేట్ చేశారు.   టూరిస్టులు ఈ ప్లేస్‌‌‌‌లో మూడు రోజులు గడపవచ్చు.  ఇందుకోసం ఆరువేల యూరోలు(అంటే మన కరెన్సీలో నాలుగున్నర లక్షలకు పైనే) చెల్లించాల్సి ఉంటుంది.  ఆ తర్వాత స్పెషల్ కోర్సు, ట్రైనింగ్‌‌‌‌ తీసుకోవాలి.  అప్పుడే ఆ డమ్మీ మార్స్‌‌‌‌లోకి అడుగుపెట్టడానికి అనుమతి ఉంటుంది.

కాస్మిక్‌‌‌‌ రేస్‌‌‌‌ కూడా..

సోలార్ సిస్టమ్‌‌‌‌లో నాలుగవ గ్రహమైన మార్స్‌‌‌‌పై పరిస్థితులు డిఫరెంట్‌‌‌‌గా ఉంటాయి.  నాసా రిపోర్ట్‌‌‌‌ ప్రకారం.. రెడ్‌‌‌‌ ప్లానెట్‌‌‌‌పై దుమ్ము, తేమ, ఎటు చూసినా ఎడారి దిబ్బలు కనిపిస్తాయి.  సీజన్స్‌‌‌‌ ఎప్పటికప్పుడు మారుతుంటాయి.  మంచు ధృవాలతో పాటు అగ్ని పర్వతాలు ఉన్నాయి.  అంతేకాదు భూమ్మీద నుంచి రోవర్స్‌‌‌‌ అడుగుపెట్టిన ఏకైక గ్రహం కూడా ఇదే.  ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మార్స్‌‌‌‌ను ప్రత్యేకంగా భావిస్తుంటారు.  మార్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కోసం కాంటాబ్రియా గుహలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ తేమ తక్కువగా ఉంటుంది.  సన్‌‌‌‌ లైట్‌‌‌‌ లేకుండా, తక్కువ టెంపరేచర్‌‌‌‌తో ‘ఏరెస్ స్టేషన్‌‌‌‌’ అనే కాలనీని స్పెషల్‌‌‌‌గా డిజైన్‌‌‌‌ చేశారు. ఇక్కడి వాతావరణంలోకి బలమైన గాలులు, హైలెవల్‌‌‌‌ సోలార్ రేడియేషన్‌‌‌‌,  కాస్మిక్‌‌‌‌ రేస్‌‌‌‌ను పంపిస్తుంటారు.  60 మీటర్ల మందం గుహలో 1.5 కిలోమీటర్‌‌‌‌ పరిధిలో ఈ స్టేషన్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. స్పేస్‌‌‌‌లో మాదిరిగానే ఇక్కడా గురుత్వాకర్షణ శక్తి ఉండదు.

ఏం జేపిస్తరంటే…

టూరిస్టుల ఏజ్‌‌‌‌ 18 ఏళ్లు నిండితేనే ఈ అడ్వెంచర్‌‌‌‌కి అనుమతిస్తారు. ముందుగా టూరిస్టులు 26 రోజుల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కోర్స్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.  మూడు రోజులపాటు  ట్రైనింగ్‌‌‌‌ తీసుకోవాలి.  తర్వాత వరుసగా కొన్ని ఇంటర్వ్యూలు చేస్తారు. అవి క్లియర్‌‌‌‌ అయితేనే లోపలి పరిస్థితుల గురించి డెమో ఇస్తారు. మార్స్‌‌‌‌ పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలి?, హైడ్రోపోనిక్స్‌‌‌‌(మట్టి లేకుండా మొక్కలు పెంచడం), ప్రత్యేకమైన లాబోరేటరీస్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ పండించడం నేర్పిస్తారు.  ఫిజికల్‌‌‌‌–సైకలాజికల్‌‌‌‌గా టూరిస్ట్‌‌‌‌ ఫిట్‌‌‌‌గా ఉన్నారో లేదో పరిశీలిస్తారు. ఆ తర్వాతే ‘మిషన్‌‌‌‌ రెడ్‌‌‌‌ ప్లానెట్‌‌‌‌’ షురూ అవుతుంది. యూరోపియన్‌‌‌‌ స్పేస్‌‌‌‌ ఏజెన్సీ (ఈఎస్‌‌‌‌ఏ) పర్మిషన్‌‌‌‌తోనే ఆస్ట్రోల్యాండ్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ ప్లానెటరీ ఏజెన్సీ ఈ అడ్వెంచర్ ఈవెంట్‌‌‌‌ నిర్వహిస్తుండటం విశేషం.

తట్టుకుని ఉండాలె!

మొత్తం మూడు రోజులపాటు ఈ టూర్‌‌‌‌ ఉంటుంది.  స్పేస్‌‌‌‌ సూట్స్‌‌‌‌ తరహాలో ఉండే పాలీమర్‌‌‌‌ సూట్స్‌‌‌‌ వేసుకుని గడపాలి.  తిండి కోసం ఎదురు చూడకూడదు.  ప్రత్యేక ల్యాబోరేటరీల్లో పండిన వంటను తినాలి. అదీ స్వయంగా పండించుకోవాలి. ప్రెజర్ ఎక్కువగా ఉండే క్యాబిన్‌‌‌‌లలో పడుకోవాలి.  మధ్య మధ్యలో నిర్వాహకులు కొన్ని టాస్కులు కూడా ఇస్తారు. అవి కూడా చేయాల్సి ఉంటుంది. సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టూరిజంలో భాగంగా సమ్మర్‌‌‌‌లో ఈ ఈవెంట్‌‌‌‌ మొదలైంది. ఇప్పటికే వంద మందిని ఎంపిక చేసి, పది మంది చొప్పున ఒక్కో టీంను తీసుకెళ్తున్నారు.  సైంటిఫిక్‌‌‌‌గానే కాదు, ఎమోషనల్‌‌‌‌గా కూడా ఈ అడ్వెంచర్ ట్రిప్‌‌‌‌ టూరిస్టులపై ప్రభావం చూపెడుతుందని చెప్తున్నారు ఆస్ట్రోల్యాండ్‌‌‌‌ నిర్వాహకులు.  మార్స్‌‌‌‌పై లివింగ్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌తో పాటు భవిష్యత్తులో ఇతర గ్రహాలపై సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిస్థితుల్నిటూరిస్టులు ఇప్పుడే ఫేస్‌‌‌‌ చేయొచ్చని చెప్తున్నారు. వాళ్లు.

Latest Updates