దొంగిలించడంలో రాహుల్ ఎక్స్‌పర్ట్ : FM నిర్మల సీతారామన్

కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై చేసిన విమర్శకు బదులిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. కేంద్రప్రభుత్వానికి రూ.లక్షా 76వేల కోట్లు మంజూరు చేస్తామంటూ సోమవారం నాడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఆర్థిక వ్యవస్థను పతనం చేసి ఆ గాయాన్ని కనిపించకుండా మాస్క్ వేసేందుకు  ఆర్బీఐ నుంచి నిధులను దొంగతనం  చేస్తున్నారంటూ తీవ్ర విమర్శ చేశారు రాహుల్ గాంధీ.

దీనిపై మంగళవారం నాడు ఎఫ్ఎం నిర్మల సీతారామన్ స్పందించారు. “రాహుల్ గాంధీ గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని చోర్ చోర్ అంటూ పదే పదే విమర్శించేవారు. జనం ఆయనకు, వారి పార్టీకి బుద్ధి చెప్పింది. ఐనా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఇలాంటి అంశాలపై మాట్లాడేముందు.. వారి పార్టీకి చెందినవారు ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఉంటే వారి దగ్గర సమాచారం తీసుకోవాల్సింది. దొంగిలించడం అనే సబ్జెక్ట్ లో రాహుల్ ఎక్స్ పర్ట్. అందుకే.. రాహుల్ చేసిన విమర్శపై ఇంతకంటే ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు.” అని నిర్మల అన్నారు.

Latest Updates