పూర్తికాని వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్..టీకా డెల‌వ‌రీపై ఎక్స్ ప‌ర్ట్ టీం భేటీ

మ‌న‌దేశంలో క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ 2వ ద‌శ ఇంకా పూర్తి కాలేదు. కానీ టీకా డెలివ‌రీ విధానం గురించి చ‌ర్చించేందుకు మ‌రియు చివ‌రి ద‌శ టీకా ట్రయ‌ల్స్ ను నిర్ధారించే అడ్మినిస్ట్రేషన్ టీంతో నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ భేటీ అయ్యింది.

ఈ భేటీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్టర్ వి కె పాల్ అధ్యక్షతన ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్, ఇన్వెంటరీ నిర్వహణ మరియు వ్యాక్సిన్ యొక్క డెలివరీ, మెకానిజం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించింది. ఈ భేటీలో చివ‌రి ద‌శ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించింది

క‌రోనా వ్యాక్సిన్ ను ప్ర‌యోగించే వాలంటీర్ల ఎంపికకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై నిపుణ‌లు బృందం చ‌ర్చింది. దీనికి సంబంధించిన‌ ఇమ్యునైజేషన్ పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఎజిఐ) యొక్క స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ నుండి ఇన్ పుట్స్ ను కోరింది.

తొలి రెండు ద‌శ‌ల్లోనే ఇండియా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్

మ‌న‌దేశంలో క‌రోనా వ్యాక్సిన్ పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌రిశోధ‌న‌లు చేస్తున్న మూడు కంపెనీలు తొలి, రెండు ద‌శ‌ల్లోనే హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ను కొన‌సాగిస్తున్న‌ట్లు తేలింది. భారత్ బయోటెక్ , జైడస్ కాడిలాలు మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ ను పూర్తి చేసి రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను ప్రారంభించ‌నున్నాయి.

Latest Updates