ఇమ్యూనిటీ బూస్టర్స్​ ఇవే..

ఇమ్యూనిటీ బూస్టర్స్​ ఇవే..

రోగానికి ట్రీట్​మెంట్​ కంటే ఆ రోగం రాకుండా జాగ్రత్తపడటం మేలంటారు. కోవిడ్​కి ముందు జాగ్రత్త ఇంకా ఎక్కువ అవసరం. ఇమ్యూనిటీ మంచిగుంటే కరోనా వైరస్​ ఏమీ చేయలేదని ఇంతకుముందు కోవిడ్​ బారినపడి కోలుకున్నవాళ్లను చూస్తే తెలుస్తూనే ఉంది.  కరోనా వైరస్​ రాకుండా మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో? అంతే జాగ్రత్తగా మంచి ఫుడ్​ తింటూ, అందులో కూడా ఇమ్యూనిటీని పెంచే వాటిని చేర్చుకుంటూ పోతే మంచిదని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. 

సిట్రస్​ ఫ్రూట్స్​

నిమ్మ, నారింజ లాంటిపుల్లని పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి రోజులో ఏదో ఒక టైంలో నిమ్మ జాతి పండ్ల నుంచి తీసిన రసం తాగాలి. వేడి నీళ్లలో నిమ్మరసం పిండితే పులుపు ఉంటుంది. కానీ, విటమిన్​–సి ఉండదు. 

వెల్లుల్లి 

బాడీలో ఇమ్యూనిటీని పెంచే ముఖ్యమైన వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వైరల్​ ఇన్ఫెక్షన్లు, వాపులు, నొప్పుల లాంటి వాటిని తగ్గించే గుణం వెల్లుల్లికి ఉంది. 

అల్లం 
ఇన్ఫెక్షన్​, వాతావరణ మార్పుల వల్ల వచ్చే గొంతు సమస్యలను తగ్గిస్తుంది. 

ఆకు కూరలు 

ఆకుకూరల్లో విటమిన్​–సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు పుష్కలం. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ముఖ్యంగా పాలకూరలో ఇవి ఎక్కువగా ఉంటాయి. 

బాదం  
బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థ యాక్టివ్​గా ఉండటానికి విటమిన్‌–ఇ  కావాలి. బాదం గింజల్లో విటమిన్‌–ఇ అధికంగా ఉంటుంది. 

గింజలు 

బాడీలో ఇమ్యూన్​ సిస్టమ్​ కంట్రోల్‌కు పొద్దుతిరుగుడు గింజలు, ఇతర గింజలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫాస్పరస్​ మెగ్నీషియం, విటమిన్‌ – బి6,  విటమిన్​–ఇ ఎక్కువగా ఉంటాయి. 

పసుపు 

ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే గాయాలను మాన్పుతుంది.

గ్రీన్​ టీ 

ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్​ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్​గా బాడీలో ఉపయోగపడతాయి. 

బొప్పాయి 

ఇందులో విటమిన్​– సి పుష్కలంగా ఉంటుంది. దానితోపాటు మెగ్నీషియం, ఫోలేట్​ కూడా ఉంటాయి. ఇవి రోగాల బారినపడిన వాళ్లు త్వరగా కోలుకోవడానికి సాయం చేస్తాయి. 

పెరుగు, బ్రొకోలి

వీటిలో విటమిన్​ – డి ఎక్కువగా ఉంటుంది. మిగతా విటమిన్లు కూడా ఉంటాయి. ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది.