షాపింగ్స్ కు గ్లోవ్స్ వాడటం మంచిది కాదా?

‘కరోనా’ రాకుండా ఉండాలంటే ఎవరికివాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా ఫేస్‌మాస్క్‌, ఫేస్‌షీల్డ్‌ తొడుక్కోవడం, రెగ్యులర్‌‌గా హ్యాండ్‌ వాష్‌ చేసుకోవడం, శానిటైజర్‌‌ వాడటం వంటివి చేస్తున్నారు. ఇంకొందరు గ్లోవ్స్‌ వాడుతున్నారు. అయితే గ్లోవ్స్‌ రెగ్యులర్‌‌గా వాడటం అంత మంచిది కాదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. కొన్ని సందర్భాల్లోనే వీటిని వాడాలని చెప్తున్నారు.

గ్లోవ్స్‌‌ వాడటం వల్ల కరోనా రాకుండా ఉండేది కొన్ని సందర్భాల్లోనే. ఇవి కూడా కరోనా వచ్చేందుకు కారణం కావచ్చన్నది నిపుణుల మాట. గ్లోవ్స్‌‌ను పేషెంట్‌‌కు సంబంధించి కేర్‌‌‌‌ తీసుకుంటున్నప్పుడు మాత్రమే వాడాలి. ఇంట్లో ఉన్న పేషెంట్‌‌కు సంబంధించి మలమూత్రాలు ఎత్తిపోయడం, వాంతి చేసుకుంటే క్లీన్‌‌ చేయడం, ఆహారం అందించడం వంటివి చేస్తున్నప్పుడు కచ్చితంగా గ్లోవ్స్‌‌  వాడాలి. వాటితోపాటు మాస్క్​ కూడా. రోజువారీ అవసరాలకు గ్లోవ్స్‌‌ వాడాల్సిన అవసరం లేదు. అవి కూడా డిస్పోజబుల్‌‌ గ్లోవ్సే వాడాలి. ఆ తర్వాత వీటిని జాగ్రత్తగా తీసేసి, వేరేవాళ్లు తాకే వీల్లేకుండా, కవర్‌‌‌‌లోపెట్టి, డస్ట్‌‌బిన్‌‌లో పడేయాలి. ఆ తర్వాత వేరే ఏదీ ముట్టుకోకుండా, హ్యాండ్‌‌వాష్‌‌ చేసుకోవాలి. శానిటైజర్ వాడాలి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే గ్లోవ్స్‌‌ వాడాలి.

షాపింగ్‌‌ చేసేటప్పుడు

గ్రాసరీ షాపింగ్‌‌ చేసేటప్పుడు కొంతమంది గ్లోవ్స్‌‌ వాడుతున్నారు. ఇది అంతమంచిది కాదని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. చేతులతో పోలిస్తే, గ్లోవ్స్‌‌కే వైరస్‌‌ అంటుకునే ఛాన్సెస్‌‌ ఎక్కువ. వైరస్‌‌ ఉన్న ప్రదేశంపై గ్లోవ్స్‌‌తో తాకితే, వైరస్‌‌ గ్లోవ్స్‌‌కు అంటుకుంటుంది. వాటి ద్వారా ఆ వ్యక్తి శరీరంపైకి వైరస్‌‌ చేరొచ్చు. గ్లోవ్స్‌‌ తొడుక్కుని ముఖం, నోరు తాకితే వైరస్‌‌ లోపలికి పోతుంది. అందువల్ల గ్లోవ్స్‌‌ లేకుండా షాపింగ్‌‌ చేసినా పెద్ద తేడా లేదు. షాపింగ్‌‌కు వెళ్లేటప్పుడు మాస్క్‌‌ తొడుక్కుని, శానిటైజర్‌‌‌‌ వాడాలి. శానిటైజ్‌‌ వైపర్స్‌‌తో కార్ట్‌‌ హ్యాండిల్‌‌ క్లీన్‌‌ చేసి, వైపర్స్‌‌ను డస్ట్‌‌బిన్‌‌లో పడేయాలి. సరుకుల లిస్ట్‌‌ ముందే ప్రిపేర్‌‌‌‌ చేసుకుని, త్వరగా షాపింగ్‌‌ చేయాలి. పక్కన ఎవరైనా దగ్గుతున్నా, తుమ్ముతున్నా దూరంగా ఉండాలి. షాపింగ్‌‌ చేసి ఇంటికొచ్చాక హ్యాండ్‌‌వాష్‌‌ చేసుకోవాలి.

 

Latest Updates