నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?

    స్టోర్‌‌ చేసిన ఆర్నెళ్ల వరకు సేఫ్‌‌: సైంటిస్టులు

    ప్లాస్టిక్‌‌ బాటిళ్లలోని నీళ్లను రెగ్యులర్‌గా తాగితే రోగాలొస్తయ్‌

తిండికి, మందులకు సంబంధించి ప్యాక్‌‌ చేసే ప్రతి వస్తువుపైనా ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉంటదిగదా? మరి నీళ్ల బాటిళ్లపై ఎప్పుడైనా ఈ డేట్‌‌ చూశారా? అసలు నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉంటదా? ‘ఇంత టైం’ తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అయితదా? అంటే రీసర్చర్లు మాత్రం అవుననే అంటున్నారు. సరిగ్గా స్టోర్‌‌ చేసిన నీళ్లు 6 నెలల వరకు తాగడానికి పనికొస్తాయని చెబుతున్నారు. ప్లాస్టిక్‌‌ వాటర్‌‌ బాటిళ్లలో నీటిని 6 నెలల తర్వాత తాగకపోవడమే మంచిదని అంటున్నారు. ప్లాస్టిక్‌‌ నుంచి బైస్పినాల్‌‌, ఇతర రసాయనాలు విడుదలవుతుంటాయని, ఇవి కలిసిన వాటర్‌‌ తాగితే రోగాలొస్తాయని వివరిస్తున్నారు. ప్లాస్టిక్‌‌ బాటిళ్లలోని నీటిని రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే మెల్లమెల్లగా చూపు మందగిస్తుందని, మలబద్దకం సమస్యలొస్తాయని, రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. టాప్‌‌ వాటర్‌‌ గానీ, ఇంకెందులోని నీళ్లయినా టేస్ట్‌‌ మారినట్టు అనిపిస్తే  వేడి చేసి తాగడమే బెటరని, తాగకపోతే మరీ మంచిదని సూచిస్తున్నారు. నీటిలోని ఆక్సిజన్‌‌ పరిమాణం తగ్గి కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ స్థాయి పెరిగి కాస్త యాసిడ్‌‌లా అనిపిస్తుందని, అందుకే టేస్ట్‌‌ మారిందని అనుకుంటామని చెబుతున్నారు.

నీళ్లను సక్కగ స్టోర్‌‌ చేయాలె

నీళ్లను సరిగా స్టోర్‌‌ చేయడం చాలా అవసరమని.. దీని వల్ల వాంతులు, వికారం లాంటి చాలా రోగాలు రాకుండా ఆపొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా మంది చేసే పెద్ద తప్పు నీటిని వేడి ప్రదేశాల్లో నిల్వ ఉంచడమని, వేడెక్కువైతే ప్లాస్టిక్‌‌ బాటిళ్లలోని రసాయనాలు నీళ్లలో కలిసి తాగడానికి పనికి రాకుండా పోతాయని వివరిస్తున్నారు. చల్లటి, పొడి వాతావరణంలో నీటిని స్టోర్‌‌ చేస్తే మంచిందంటున్నారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

Latest Updates