బైక్ కవర్ బ్యాగులో పేలిన సెల్ ఫోన్.. తప్పిన ప్రమాదం

కరీంనగర్ జిల్లా :  ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా సడెన్ గా సెల్ ఫోన్ పేలిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. గన్నేరువరం మండలంలోని, కాసింపేట గ్రామానికి చెందిన కయ్యం సంపత్ వివో సెల్ ఫోన్ పేలింది. ఆదివారం కాసింపేట నుండి తన మిత్రుడి దగ్గరకు గన్నేరువరం బయలుదేరాడు సంపత్. అయితే మార్గమధ్యలో వర్షం మొదలయ్యాయి. సెల్ ఫోన్ తడిసి పోతుందేమోనని జేబులో నుంచి తీసి, బైక్ పెట్రోల్ ట్యాంక్ పై ఉండే కవర్ బ్యాగ్ లో పెట్టి ప్రయాణించాడు. కొంచెం దూరం వెళ్ళగానే బైక్ బ్యాగ్ లోని కవర్ శబ్దం వచ్చింది. బైక్ ఆపి చూసేసరికి సెల్ ఫోన్ తో పాటు బ్యాగు అడుగు భాగం కాలిపోయిందని తెలిపాడు సంపత్.

అదృష్టవశాత్తు చిరుజల్లులు రావడంతో సెల్ ఫోన్ బైక్ కవర్ బ్యాగులో పెట్టానని.. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని చెప్పాడు. జేబులో ఉన్నప్పుడు పేలినా తనకు గాయాలయ్యేవని.. అలాగే ఇంకాస్త మంటలు  ఎక్కువ వస్తే బైక్ పెట్రోల్ ట్యాంక్ అంటుకునేదని భయం వేసిందని చెప్పుకొచ్చాడు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపాడు సంపత్.

Latest Updates