కశ్మీర్ లోని ఓ స్కూల్లో పేలుడు : 10మందికి గాయాలు

జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో గాయపడిన విద్యార్థులను వెంటనే పుల్వామాలోని సర్కారు దవాఖానకు తరలించారు. పది మంది విద్యార్థులకు గాయాలైనట్టు తెలిసింది. వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని అధికారులు  అంటున్నారు. పేలుడు ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు.  ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates