బీఆర్కే భవన్ కు పేలుళ్ల పరేషాన్

రాష్ట్ర పరిపాలనకు ప్రధాన కేంద్రంగా మారనున్న బీఆర్కే భవన్ కు పేలుళ్ల భయం పట్టుకుంది. భవన్ కు సమీపంలో జరుగుతున్న అమరవీరుల భవనం పనులు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిర్మాణ పరిసరాల్లో పెద్ద ఎత్తున బండ ఉండటంతో జిలెటిన్ స్టిక్స్ ద్వారా దాన్ని తొలగిస్తున్నారు. ఈ పేలుళ్ల వల్ల బీఆర్కే భవన్ షేక్ అవుతోందని, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని అధికారులు, ఉద్యోగులు భయపడుతున్నారు. మంత్రులు, ఉద్యోగులు.. అంతా అక్కడే లుంబిని పార్కు పక్కన జల దృశ్యం ప్లేస్ లో రూ.100 కోట్ల వ్యయంతో అమరవీరుల స్థూ పం, భవనాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే 6 నుంచి 8 నెలల్లో అమరవీరుల భవన నిర్మాణం పూర్తవుతుందని ఇటీవల రోడ్లు భవనాల మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

అయితే భవనం సమీపంలో పెద్ద ఎత్తున బండ ఉండటంతో బ్లాస్టింగ్ చేపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా పేలుళ్లు కొనసాగనున్నట్లు సమాచారం. ఇక తాత్కాలి క సెక్రటేరియెట్​గా సుమారు ఏడాది నుంచి రెండే ళ్ల పాటు బీఆర్కే భవన్ కొనసాగనుంది. నెల రోజుల నుంచి సెక్రటేరియెట్ లోని శాఖలను భవన్ లోకి షిప్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎస్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు అక్కడి నుంచే డ్యూటీ చేస్తు న్నారు. వచ్చే వారంలో మిగతా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా బీఆర్కే భవన్ నుంచే పని చేయనున్నారు. మొత్తం 2 వేల మంది ఉద్యోగులు అక్కడి నుంచి డ్యూటీ చేస్తారు. త్వరలో మంత్రులు కూడా బీఆర్కే నుంచి విధులు నిర్వర్తిస్తారు. ఈ నేపథ్యం లో పేలుళ్ల వల్ల జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Latest Updates