లంకను వీడని పేలుళ్లు..మళ్ళీ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

శ్రీలంకలో పరిస్థితి ఏ మాత్రం కుదుటపడలేదని…మళ్లీ బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లకు దేశం అతలాకుతలమైంది. పరిస్థితి అదుపులోకి రాకపోగా మరిన్ని పేలుళ్లకు కుట్రలు బయటపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొలంబోలో ఇప్పటికీ కర్ఫ్యూ వాతావరణమే ఉండగా దేశవ్యాప్తంగా ఇంకా హైఅలర్ట్ కొనసాగుతుంది. అధికారాలు హోటళ్లు, బహిరంగ ప్రదేశాలు, దైవ సన్నిధానాలు, ఇక్కడా అక్కడా అని లేకుండా ప్రతి దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మళ్లీ ఆ దేశంలో వరుస బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతో దేశం ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్‌ ట్రక్కు, వ్యాన్‌ భారీగా పేలుడు పదార్ధాలను మోసుకెళ్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో అక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొలంబోలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు.

Latest Updates