ఓటు వేసే సమయం గంట పెంపు: EC

ఓటర్ల  సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని గంట పెంచింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్‌ ప్రక్రియను ఆరు గంటల వరకు పెంచుతూ తాజా ఆదేశాలు జారిచేసింది. అంటే సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌  దగ్గరకు చేరుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ఎంత రాత్రయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తోంది EC. మరింత పారదర్శకత కోసం ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ను అనుసంధానించి ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందీ, లేనిదీ పరిశీలించుకునే అవకాశం కూడా ఇటీవల కల్పించారు. వీవీ ప్యాట్‌లో స్లిప్‌ కనిపించి వెళ్లేందుకు 7 సెకన్ల సమయం పడుతుంది.  దీంతో ఓటర్లు ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మండు వేసవి కాలం, ఎండలు మండిపోతుండడంతో సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడ్డాక పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ లెక్కలోనికి ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించింది.

Latest Updates