అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణ గడువు.. అక్టోబర్ 31 దాకా పొడిగింపు

హైదరాబాద్: అనధికార లేఔట్ ల క్రమబద్ధీకరణకు అక్టోబర్31 దాకా గడువు పొడిగించారు. ఈనెల 15తో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే అనేక మంది ప్రజలు.. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు పలు కారణాలవల్ల ఈ అవకాశాన్ని  ఉపయోగించుకోలేకపోయారని ప్రభుత్వానికి లేఖలు పంపడంతోపాటు.. స్వయంగా కలసి వినతులు ఇచ్చారు. ప్రజల తరపున నేతలు చేసిన వినతులకు స్పందించి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

Latest Updates