సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పదవీ కాలం పొడిగింపు

కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పదవి కాలాన్ని మరో 18 నెలలు పొడిగిస్తూ కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అపాయింట్‌మెంట్‌  సెప్టెంబర్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. తర్వాతి ఉత్తర్వులు ఇచ్చే వరకు లేదా ఫిబ్రవరి 28, 2022  (ఏది ముందొస్తే అది) వరకు ఆయనీ పదవిలో ఉంటారు.

Latest Updates