TSRTC బస్సుల ప్రయాణ వేళలు పొడిగింపు

TSRTC బస్సుల ప్రయాణ వేళలు పొడిగింపు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈనెల 10 నుంచి ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు సడలింపులను ఇచ్చింది. దీంతో TSRTC జిల్లాలకు నడిపే బస్సులను ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి  తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకే నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఉ.6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని TSRTC గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపు  టైంలో సిటీ బస్సులను తిప్పుతామన్నారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉ.6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.