కాస్త ఇంట్రావర్ట్స్ గా ఆలోచించండి గురూ

ఇంట్రావర్ట్స్  అంటే ఏదీపైకి చెప్పకుండా మనసులోనే దాచుకునేవాడు. సోషల్ రిలేషన్స్ నుండి తప్పించుకుంటాడు. నలుగురితో  కలవకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. వందమంది మధ్యలో ఉన్నా కూడా ఇంట్రావర్స్ ఖాళీనే కానీ అతని కంటూ సొంత ఆలోచనలుఉంటాయి. అలాగే ఎక్సో ట్రోవర్ట్స్ .. ఏదైనా సరే బయటికి చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోలేరు. నలుగురితో స్నేహంగా మెదులుతారు. ఎలాంటి పనిచేయాలన్నా పక్కన ఉండే వారి సలహాలు తీసుకుంటారు. ప్రతి పనికీ ముందుఉండాలని అనుకుంటారు. అటెన్ష న్ కోసం ప్రయత్నిస్తారు. తద్వారా వీళ్ళకంటూ సొసైటీలో ఒకరకమైన గుర్తింపు ఉంటుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఎక్స్ ట్రోవర్ట్ కి  ఒకేచోట ఉండడం నచ్చడంలేదు. ఈక్రమంలో బయటికి వచ్చేందుకు, ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. లాక్ డౌన్తో ఎటూ కదల్లే ని పరిస్థి తి. ఎమర్జెన్సీ అవసరాలకోసం భయం భయంగా బయటికి రావాల్సి వస్తోంది. ఇవన్నీసమస్యలు అయితే.. ఇంతకాలం నలుగురి మధ్య, నలుగురి మీద ఆధారపడి బతికిన ఎక్స్ ట్రావర్ట్స్ పరిస్థి తి దారుణంగా ఉంది. సోషలైజేషన్ కు దూరం కావడంతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇంట్రావర్ట్స్ కు ఇది అలవాటైనల లైఫ్. కాబట్టి ఎలాంటి ప్రభావం చూపట్లే దని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ టైంలో ఎక్స్ ట్రావర్ట్స్ కూడా ఇంట్రావర్ట్స్ లా ఆలోచించాలని సూచిస్తు న్నారు.

ఇంట్రావర్ట్స్ లా  ఆలోచించండి..  

ఫిలాసఫీని కొన్నాళ్ళు పక్కనపెట్టేయండి. ఈ లాక్ డౌన్  చేయడానికి బోలెడుపనులు ఉంటాయి. కొన్ని స్కిల్స్ పెంచుకోవడంతో పాటు ఎన్నో పెండింగ్ పనులని పూర్తి చేసుకోవచ్చు. పెంపుడు జంతువుల (పెట్స్) తో గడపడం వల్ల  మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ముఖ్యంగా ఎక్ట్సావర్ట్స్  ,సొంత నిరయాల ్ణ కు అలవాటు పడాల్సిన టైమ్ఇదే. డెసిషన్ తీసుకోగలిగే స్థాయికి చేరుకోవడం, తద్వారా

మెంటల్ హెల్త్  (మానసికఆరోగ్యం) ఇంప్రూవ్ అవుతుంది.ఈవిషయంలో ఇంట్ట్రావర్ట్స్ ని స్ఫూర్తిగాతీసుకోవడం ముఖ్యం. అదేటైంలో ఇంట్ట్రావర్ట్స్ కి ఇంట్లో వాళ్లతో దగ్గర కావడానికి ఇదొకమంచి ఛాన్స్.

సోషల్ టైం తెలుసా?

లాక్ డౌన్ టైంలో   “సోషల్ టైమ్”కి కొంతభాగం ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే  ఆ టైంలో నలుగురితో సరదాగా గడపొచ్చు. అదెలాగంటే..దూరంగా ఉంటూనే పొరుగున ఉన్నవాళ్ళతో మాట్లాడొచ్చు. లేదంటే ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్  చేసి ఫ్యామిలీ,ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో  గడిపి ఆ ఒంటరి తనం దూరం చేసుకోవచ్చు.

వర్క్ ఫ్రం హోమ్ఉద్యోగులకి కొలిగ్స్ ను మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి.అలాంటపుడు గ్రూప్ లో లేదా  చాటింగ్ చేసుకోవచ్చు. పనికి సంబంధించిన అనుమానాలు తీర్చుకోవచ్చు.అంతేకాకుండా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అయితే ఈ సోషల్ టైమింగ్ కు ఒకటైం నిర్ణయించుకోవడం బెటర్. మోస్ట్ ఇంపార్టెంట్  ఇంతకాలం ఇంట్రావర్స్ ట్ ను చూసి కామెంట్స్ చేసిన ఎక్స్ ట్రో వర్ట్స్ కి  .. ఇప్పుడుఇంట్రావర్స్ ట్ గాఉండాల్సిన పరిస్థి తి. అలాగని ఎప్పుడూ ఒకేచోట ఉండిపోవడం శారీరక ఆరోగ్యానికి మంచిదికాదు. అందుకే కొంచెం టైం ఫిజికల్ యాక్టీవ్ చేసుకోవాలి.

తాజా గాలి కోసం వరండా,బాల్కనీల్లో,మేడమీద.. ఇంటిముందర.. ఎక్కడ వీలైతే అక్కడ వాకింగ్, ఎక్సర్ సైజ్ ,యోగా,ఆసనాలు చేసుకోవచ్చు. బయటికి వెళ్తే మనిషికి మనిషికి మధ్య ఆరు మీటర్ల దూరం మెయింటెయిన్ చెయ్యాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎక్స్ ట్రోవర్ట్స్  దాచుకోవాల్సిన  విషయం “ఒంటరిగా ఉండటం అంటే పక్కన ఎవరూ(ఫిజికల్ గా ) లేకపోవడంకాదు..అలా లేరు అనే ఫీలింగ్స్ సైకలాజికల్గా మరీ ప్రమాదం.” కాబట్టి ఎక్స్ట్రావర్ట్స్ అయినా .. ఇంట్రావర్ట్స్ సోషల్ డిస్టెన్స్ ద్వారా కలిసికట్టుగా కరోనా వైరస్ ని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది.

Latest Updates