ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు: సీఎం జగన్

రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఇవాళ అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ‘వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలున్నాయన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ కంటి చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 70 లక్షల మంది స్కూల్‌ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెండో దశలో 400 బృందాలతో విద్యార్థులకు కంటి పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. ఉచితంగా ఆపరేషన్లు చేయడంతో పాటు కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. రూ.560 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా కంటి చికిత్సలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి ఆరు దశల్లో వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్‌ 16 వరకు మొదటి దశ, ఫిబ్రవరి 1 నుంచి తర్వాతి దశ కంటి వెలుగు నిర్వహించనున్నట్లు తెలపారు సీఎం జగన్.

Latest Updates