వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

75 ఏళ్ల వయసులో ఎవరైనా కృష్ణా.. రామా అంటూ ఓ మూలన కూర్చుంటారు. కానీ, ఈజిప్టు‌కు చెందిన 75 ఏళ్ల ఎజ్ ఎల్-దిన్ బహదర్ మాత్రం ఫుట్‌బాల్ ఆడడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈజిప్టుకు చెందిన ఒక క్లబ్ బహదర్‌ని మూడవ డివిజన్ తరపున ఆడటానికి ఎంపిక చేసింది. దాంతో ఎక్కువ వయసులో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడునున్న బహదర్.. గిన్నిస్ వరల్డ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రికార్డ్స్‌లోకెక్కే అవకాశముంది. గతంలో ఈ రికార్డు ఇజ్రాయెల్ ఆటగాడు ఐజాక్ హాయిక్ 73 ఏళ్ల వయసుతో నమోదైంది. ఇంత వృద్ధాప్యంలో ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఎంపికైన బహదర్.. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటున్నాడు. ఎలాగైనా సరే మ్యాచ్ ఆడి ఐజాక్ హాయిక్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలని బహదర్ ఊవ్విళ్లూరుతున్నాడు. బహదర్ క్లబ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని దృవీకరిస్తూ.. ఈజిప్టు ఫుట్‌బాల్ అసోసియేషన్ (EFA) కొన్పి ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

For More News..

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

Latest Updates