చిన్నారికి హామిల్టన్​ చిరు కానుక

మరో వారంలో చనిపోతాడు.. అని హారీ షా తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. కానీ, తనకు అరుదైన బోన్​ కేన్సర్​ ఉన్నట్టుగానీ, చనిపోతానని గానీ ఆ చిన్నారికి తెలియదు. రేసర్​ లూయిస్​ హామిల్టన్​ అంటే చాలా ఇష్టం. స్పానిష్​ గ్రాండ్​ ప్రిలో పాల్గొంటున్న హామిల్టన్​కు ఆస్పత్రి బెడ్​ పై నుంచే హారీ ఆల్​ ద బెస్ట్​ చెప్పాడు. గెలవాలని కోరుకున్నాడు. ఆ వీడియోను మెర్సిడిస్​ ప్రతినిధులు హామిల్టన్​కు చూపించారు. దానికి చలించిపోయిన అతడు, ఆ ఐదేళ్ల చిన్నారికి తన రేస్​ కారు డూప్​ను పంపించాడు. గ్రాండ్​ ప్రి విన్నర్​ ట్రోఫీనీ గిఫ్ట్​ కింద ఇచ్చాడు. ఈ చిన్నారి తనకో మంచి సందేశం ఇచ్చాడని, అతడే తనకు స్ఫూర్తి అని హామిల్టన్​ రేస్​ అయ్యాక చెప్పాడు. రేస్​ గెలుపును హారీకి అంకితమిస్తున్నట్టు చెప్పాడు. తన కోసం ఏదైనా చేయాలనిపిస్తోందన్నాడు.