F2 ఫన్ సాంగ్ : రెచ్చిపోతున్న వెంకీ, వరుణ్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ F2. ఈ మూవీ నుండి రెచ్చి పోదాం బ్రదర్ అనే వీడియో సాంగ్ ను బుధవారం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వెంకీకి తోడు వరుణ్ తేజ్ నవ్వించి ఆకట్టుకున్నాడు.

సాంగ్ చూస్తుంటే పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టయినర్ గా కనిపిస్తోంది. ఈ మూవీలో వెంకీ సరసన తమ్మన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..వరుణ్ తో మెహ్రీన్ నటించింది. సినిమా ప్రారంభం నుంచి ఆసక్తి పెంచగా..లేటెస్ట్ గా రిలీజైన టీజర్ అదుర్స్ అనిపించింది. ఇవాళ వచ్చిన వీడియో సాంగ్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

సాంగ్ బాగా రావడంతో ఈ సందర్భంగా ట్విట్టర్ లో దేవీశ్రీకి థాంక్స్ చెప్పాడు డైరెక్టర్. మ్యూజిక్ ఇరగదీశాడు థాంక్స్ DSPగారు అని ట్వీట్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు సమర్పణలో రూపొందుతున్న F2 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Posted in Uncategorized

Latest Updates