రేషన్ షాపుల్లో మాస్కుల అమ్మకం

అగ్గువ ధరకే అందుబాటులోకి
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

భోపాల్: భోపాల్ సిటీలో మహిళలు తయారుచేస్తున్నకాటన్ క్లాత్ మాస్కులు కొనుగోలు చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 50 లక్షల మాస్క్‌‌‌‌లను కొనడానికి రెడీ అయింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులలో వాటిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇంటి దగ్గర మహిళలు తయారుచేస్తున్న కాటన్ క్లాత్ మాస్కుల్ని నేరుగా వారి నుంచే కొనుగోలు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. దీనికోసం సంబంధిత వెబ్ సైట్ లో మహిళలు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి వెయ్యి మాస్కులకు వారు ఆర్డర్ పొందవచ్చునని తెలిపారు.

For More News..

చీపురు పట్టి ఇల్లు ఊడ్చి, తుడిచిన యంగ్ టైగర్

ఎన్టీఆర్, రాంచరణ్ లకు సవాల్ విసిరిన రాజమౌళి

గ్రీన్‌ జోన్‌లోకి తెలంగాణలోని ఏడు జిల్లాలు

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..

Latest Updates