ఏడాది మొత్తం ఇంటినుంచే విధులు : బోనస్ ఇచ్చిన ఫేస్ బుక్.. ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్..?

ఈ ఏడాది చివరి వరకు ఫేస్ బుక్ , గూగుల్ ఉద్యోగులు ఇంటినుంచే విధులు నిర్వహిస్తారని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని, సోషల్ డిస్టెన్స్ తో పాటు వైరస్ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించేందుకు గూగుల్, ఫేస్ బుక్  సదుపాయాన్ని కల్పించాయి.

ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఫేస్ బుక్  

ఫేస్ బుక్ తొలత వర్క్ ఫ్రమ్ హోం పాలసీ జూన్ 6 వరకే ఉంచింది. జూన్ 6 తరువాత ఉద్యోగులు ఆఫీస్ నుంచే విధులు చేయాల్సి ఉంది. కానీ ఈరోజు నుంచే ఫేస్ బుక్ ఉద్యోగులు ఇంటినుంచే విధులు నిర్వహించవచ్చని..ఆ సంస్థ స్పోక్ పర్సన్ ఒకరు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు క్షేమం ముఖ్యం. ఆఫీస్ లో వర్క్ చేసేందుకు ఇష్టంగా ఉన్న ఉద్యోగులు రావొచ్చని అన్నారు. కాగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు, వారి పిల్లల సంరక్షణ ఖర్చుల కోసం వెయ్యి డాలర్లు బోనస్ గా ప్రకటించింది.

వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులకు ప్రోత్సాహకాల్ని నిలిపివేయనున్న గూగుల్..?

ఇటీవల సంస్థాగత సమావేశంలో  గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ జులై నుంచి అన్నీ భద్రతా చర్యలతో ఉద్యోగులు ఆఫీస్ కి వచ్చి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఎక్కువ శాతం ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు ఇష్టపడుతున్నారని, ఉద్యోగుల భద్రత, విధుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా  ఇంటి నుంచి ఉద్యోగం చేస్తే ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని నిలిపివేసేలా గూగుల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Updates