ఫేస్‌బుక్‌ ఉద్యోగికి కరోనా… ఆఫీసు మూసివేత

సోషల్‌ మీడియా ‘ఫేస్‌బుక్‌’ లండన్‌లోని తన కార్యాలయాన్ని మూసివేసింది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి దగ్గర నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు తేలడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌లో తమ కంపెనీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లండన్‌లోని తమ కార్యాలయాన్ని సందర్శించారని… ఆ తర్వాత ఆయనకు కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు తేలిందని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫేస్‌బుక్‌ ఆఫీసులో వైరస్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్యపరంగా శుద్ధి కార్యాక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అది పూర్తయ్యాక మళ్లీ కార్యాలయాన్ని తెరుస్తాన్నారు. ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లయితే వారు వెంటనే ఆస్పత్రి సందర్శించి వైద్య చికిత్స చేయించుకోవాలన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతనే కార్యాలయానికి రావాలని తెలిపారు.

Latest Updates