మస్తు దేశాలు డేటా అడుగుతున్నయ్‌‌ : ఫేస్‌‌బుక్‌‌

facebook-data-need-countries

యూజర్ల డేటాను అడుగుతున్న ప్రభుత్వాల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని ఫేస్‌‌బుక్‌‌ వెల్లడించింది. 2018 రెండో భాగంలో 1,03,815 నుంచి 1,10,634 కు (7 శాతం) వినతులు వచ్చాయని, ఇందులో అమెరికా తొలి స్థానంలో, ఇండియా రెండో పొజిషన్‌‌‌‌లో ఉందని చెప్పింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌‌, జర్మనీ, ఫ్రాన్స్‌‌‌‌ ఉన్నాయని పేర్కొంది. గత 6 నెలల్లో 300 కోట్ల ఫేక్‌‌‌‌ అకౌంట్లను తొలగించినట్టు ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ వెల్లడించింది. 2018 చివరి మూడు నెలల్లో 120 కోట్లు, 2019 తొలి మూడు నెలల్లో 180 కోట్ల అకౌంట్లను తీసేశామంది. తొలగిస్తున్న ఫేక్‌‌‌‌ అకౌంట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని, ప్రతి నెల పెరుగుతున్న యూజర్లలో 5 శాతం నకిలీవని చెప్పింది. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో చూస్తున్న ప్రతి10 వేల పేజీల్లో 11 నుంచి 14 పేజీలు అడల్ట్‌‌‌‌ కంటెంట్‌‌‌‌, సెక్సువల్‌‌‌‌ యాక్టివిటీవేనని తెలిపింది.

గూగుల్‌ లోకి బగ్

తమ జీ సూట్‌‌‌‌ యూజర్ల పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లను ప్లెయిన్‌‌‌‌ టెక్స్ట్‌‌‌‌ రూపంలో ఓ బగ్‌‌‌‌ సేవ్‌‌‌‌ చేసిందని గూగుల్‌‌‌‌ వెల్లడించింది. ఇలాంటివి రెండుసార్లు గుర్తించామని చెప్పింది. ఎంతమంది పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు బయటికొచ్చాయో మాత్రం చెప్పలేదు. జీ సూట్‌‌‌‌ కస్టమర్ల పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లే బయటకొచ్చాయని, మామూలు అకౌంట్లున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. అన్‌‌‌‌హ్యాష్డ్‌‌‌‌ పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌ సేవ్‌‌‌‌ అవడం తొలిసారి 2005లో జరిగిందని, ఇది ఏడాదిలోనే గుర్తించామని, మొత్తంగా 14 ఏళ్లు ఈ పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు సేవ్‌‌‌‌ అయ్యాయని తెలిపింది. జీ సూట్‌‌‌‌ సైన్‌‌‌‌ అప్‌‌‌‌ ట్రబుల్‌‌‌‌ షూటింగ్‌‌‌‌కు సంబంధించి మార్పులు చేస్తున్నప్పడు రెండోసారి 2019 జనవరిలో ఈ విషయం గుర్తించామని చెప్పింది. కొంతమంది పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు తమ ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ సర్వర్‌‌‌‌లో స్టోర్‌‌‌‌ అయ్యాయంది. సమస్యలను పరిష్కరించామని, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లను ఎవరూ దుర్వినియోగం చేయలేదని చెప్పింది.

Latest Updates