కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్

కరోనా వైరస్‌ తో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం లో పని చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌ బుక్‌ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసేలా అవకాశం కల్పించింది. అంతేకాదు 45 వేల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు 6నెలల సాలరీని బోనస్ గా అందిస్తున్నట్లు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో.. తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఈ డబ్బులు కేటాయించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోం చేసే సదుపాయం కల్పించిన వారికి అదనంగా మరో 1000 డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మనీతో ఇంటి నుంచి పని చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు సంస్థలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ సదుపాయం ఉండదని తెలిపారు జుకర్ బర్గ్. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న ఫేస్ బుక్ కార్యాలయాల్లో లాక్ డౌన్ ప్రకటించినా… వారు విధులకు రాకపోయినా పూర్తి వేతనం ఇస్తామని చెప్పారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు ఉద్యోగులకు సమయం అవసరమన్నారు. వర్క్ ఫ్రమ్ హోం  ఏర్పాటు చేసుకునేందుకు వారికి అయ్యే అదనపు ఖర్చును సంస్థ భరిస్తుందన్నారు.

 

 

 

Latest Updates