ఫేస్​బుక్, వాట్సాప్ ​సేవలకు బ్రేక్

  • వాట్సాప్,ఇన్ స్టా గ్రాం లదీ అదేతీరు
  • ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన సేవలు

కౌలాలంపూర్: ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం, వాట్సాప్ సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచే సమస్య ప్రారంభమైనా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో పీక్​స్టేజికి చేరుకుంది. ఫొటోలు, వీడియోలు డౌన్​లోడ్​కాక వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. మెసేజ్​లు సెండ్​చేయడంలోకానీ, రిసీవ్​చేసుకున్నపుడు కానీ సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఫేస్​బుక్​తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు. సింగపూర్, మనీలా, అమెరికా, లండన్​లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ప్రాబ్లం ఫేస్​చేశారు. అయితే, సేవల్లో అంతరాయాన్ని గుర్తించామని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఫేస్​బుక్​ట్వీట్​చేసింది. ఫేస్​బుక్​ఆధ్వర్యంలోని కంపెనీల(ఇన్​స్టాగ్రాం, వాట్సాప్)లోనే ఇలా జరగడం, అదీ ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం.

Latest Updates