ఫేస్‌బుక్‌లో కొత్తగా ‘ఫేస్‌బుక్‌ పే’ ఫీచర్

ప్రస్తుత కాలంలో ఎవరూ కూడా డబ్బును జేబులో పెట్టుకొని తిరగడం లేదు. ఏది కొన్నా కార్డ్ స్వైపింగ్
లేదా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ అనేది స్మార్ట్‌ఫోన్‌తోనే సులువుగా చేయోచ్చు.
కాబట్టి చాలామంది దానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ పేమెంట్ చేయడానికి ఈ మధ్య కాలంలో
ఎన్నో అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి చాలా యాప్స్ నుంచి
ఈజీగా డబ్బును పంపొచ్చు లేదా స్వీకరించొచ్చు.

తాజాగా ఫేస్‌బుక్ కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ పే అనే కొత్త ఆప్షన్‌ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లలో పిన్
లేదా బయోమెట్రిక్స్ వంటి ఆప్షన్ల ద్వారా డబ్బు పంపడానికి లేదా చెల్లింపు చేయడానికి ఈ యాప్
అనుమతిస్తుందని ఆయన తెలిపారు. లావాదేవీ జరిపినప్పుడు చెల్లింపు విధానం, తేదీ, బిల్లింగ్ మరియు ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని ఈ యాప్ అడుగుతుంది. వాటన్నింటిని ఎంటర్ చేస్తే ఈజీగా ఫేస్‌బుక్ నుంచి కూడా డబ్బు చెల్లించొచ్చు లేదా స్వీకరించొచ్చు. ఈ సదుపాయం మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కొత్త ఫేస్‌బుక్ పే ఫీచర్ ఈ వారం నుంచి అమెరికాలో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో.. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లలో మెసేజింగ్ సదుపాయాలను ఒకటి చేయాలని
యోచిస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో వినియోగదారుల కోసం
ఫేస్‌బుక్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates