జూమ్ కు పోటీగా ఫేస్‌‌‌‌బుక్ రూమ్స్..ఒకేసారి 50 మంది వీడియో కాల్

న్యూఢిల్లీవీడియో కాలింగ్‌‌‌‌ యాప్‌‌‌‌లలో దూసుకుపోతున్న జూమ్‌‌‌‌కు పోటీగా సోషల్‌‌‌‌ మీడియా దిగ్గజం ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ బరిలో దిగింది. ఒకేసారి 50 మంది వీడియో కాల్‌‌‌‌ మాట్లాడుకునేలా ‘మెసెంజర్‌‌‌‌ రూమ్స్‌‌‌‌’ యాప్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం నుంచే ఈ ఫీచర్‌‌‌‌ మొదలైంది. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ అకౌంట్ లేకున్నా మెసెంజర్ రూమ్స్‌‌‌‌లో యూజర్లను యాడ్ చేయొచ్చని, ఫోన్‌‌‌‌ నంబరుంటే చాలని సంస్థ వివరించింది. యూజర్ల ప్రైవసీ, సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని రూమ్స్‌‌‌‌ను రూపొందించామంది. అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చేందుకు ఇంకొన్ని రోజులు పట్టొచ్చని చెప్పింది. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్‌‌‌‌లలో ఈ ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. మెసెంజర్‌‌‌‌ రూమ్‌‌‌‌లో ఎవర్ని యాడ్ చేయాలలో రూమ్‌‌‌‌ క్రియేటర్‌‌‌‌కు పూర్తి కంట్రోల్ ఉంటుంది. రూమ్‌‌‌‌ అందరికీ ఓపెన్‌‌‌‌గా ఉండేదీ లేనిదీ రూమ్‌‌‌‌ కంట్రోలరే నిర్ణయిస్తారు. మెసెంజర్ లేదా ఫేస్‌‌‌‌బుక్ నుంచి యూజర్లు కాల్స్ చేసుకోవచ్చు.

జూమ్‌‌‌‌కు 30 కోట్ల మంది యూజర్లు

కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ వల్ల చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనప్పుడు కొలిగ్స్‌‌‌‌తో, పై ఉద్యోగులు, అధికారులతో మాట్లాండేదుకు, మీటింగ్‌‌‌‌లకు వీడియో కాలింగ్‌‌‌‌ యాప్‌‌‌‌లను వాడుతున్నారు. ఇలాంటి యాప్‌‌‌‌లలో జూమ్‌‌‌‌ ఈమధ్యన బాగా పాపులరైంది. గత డిసెంబర్‌‌‌‌లో కోటి మంది ఉన్న యాప్‌‌‌‌ యూజర్ల సంఖ్య ఇప్పుడు 30 కోట్లకు చేరింది. అయితే చైనాకు చెందిన జూమ్ యాప్‌‌‌‌తో యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఇదే టైమ్‌‌‌‌లో వేరే సంస్థలు కూడా వీడియో కాలింగ్‌‌‌‌ యాప్‌‌‌‌లపై దృష్టి పెట్టాయి. గూగుల్‌‌‌‌ సంస్థ తమ గూగుల్‌‌‌‌ హ్యాంగౌట్‌‌‌‌ మీట్‌‌‌‌ను గూగుల్‌‌‌‌ మీట్‌‌‌‌గా మార్చి ఒకేసారి 16 మంది స్క్రీన్‌‌‌‌పై మాట్లాడుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ కూడా మార్కెట్‌‌‌‌లోకి ‘రూమ్స్‌‌‌‌’ను విడుదల చేసింది.

Latest Updates