యూజర్స్ ఫోన్ నంబర్ తో ఫేస్ బుక్ వ్యాపారం

న్యూయార్క్ : సోషల్ మెసేజింగ్ సైట్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు.. అడిగిందే తడవుగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంటాం. అందులో మన మొబైల్ నంబర్ కూడా ఒకటి.. అయితే మనం ఇచ్చిన మొబైల్ నంబర్ తో ఫేస్ బుక్  ఏం చేస్తుందనే విషయమై అమెరికాకు చెందిన రెండు యూనివర్సిటీలు రీసెర్చ్ చేశాయి. ఈ రీసెర్చ్ రిపోర్ట్ ను గిజ్ మోడో అనే సంస్థ వెల్లడించడంతో ఫేస్ బుక్ అధికార ప్రతినిధి దీని పై స్పందించాడు.

ఫేస్‌బుక్‌లో యూజర్లు ఇచ్చే ఫోన్ నంబర్, బయోడేటా వివరాలను వారి అకౌంట్ భద్రత కల్పించేందుకు వాడుతూనే.. యాడ్స్ కోసం కూడా వాడుకుంటామని ఫేస్ బుక్ స్పోక్స్ పర్సన్ ఒకరు చెప్పారు.  యూజర్ల సమాచారాన్ని ఏ విధంగా వాడుకోవాలన్న దాని పై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు. యూజర్లు కావాలంటే తమ సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. యూజర్ల ఫోన్ నంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ) కోసం ఉపయోగిస్తుంది. దీంతో ఫేస్‌బుక్ అకౌంట్లన్నీ సేఫ్ గా ఉంటాయి. దాంతోపాటు.. ఫోన్ నంబర్లను కమర్షియల్ గా కూడా వాడుకుంటామని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది ఫేస్ బుక్.

Posted in Uncategorized

Latest Updates