మాస్కులు కంపల్సరీ.. లిప్‌స్టిక్‌కు తగ్గిన డిమాండ్‌

  • ఐ మేకప్‌కే మొగ్గు చూపుతున్న యువతులు
  • పడిపోయిన లిప్‌స్టిక్‌ అమ్మకాలు

ముంబై: కరోనా కారణంగా ప్రతి చోట ఇప్పుడు మాస్కులు కంపల్సరీ చేశారు. దీంతో ఆఫీసుకు వెళ్లాలన్నా.. బయటకి వెళ్లాలన్నా.. మూతికి మాస్క్‌ కంపల్సరీ అయిపోయింది. మాస్కు పెట్టుకుంటే పెదాలు కనిపించవు. దీంతో లిప్‌స్టిక్‌ వాడే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా లాక్‌డౌన్‌లో లిప్‌స్టిక్‌ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. పెదవులు ఎలాగూ కనిపించనందున అడవాళ్లంతా కళ్లకు మెరుగుదిద్దుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఐ మేకప్‌ కాస్మటిక్స్‌కు ఎక్కువగా గిరాకీ పెరిగిందని వ్యాపరస్థులు చెప్పారు. అందుకే ఐ మేకప్‌కు సంబంధించి మస్కరా, ఐ బ్రో పెన్సిల్‌, కాజల్‌ లాంటి వాటిని ఎక్కువగా ప్రమోట్‌ చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. “ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా లిప్‌స్టిక్‌లకు డిమాండ్‌ తగ్గిపోయింది. కేవలం వీడియో కాన్ఫరెన్స్‌ల టైంలో మాత్రమే లిప్‌స్టిక్‌ వాడుతున్నారు. అందరూ ఎక్కువగా ఐ మేకప్‌పై దృష్టి పెట్టారు” అని లోరియల్‌ బ్రాండ్‌ ఇండియా డైరెక్టర్‌‌ కవితా చెప్పారు. “ ఐ షాడోస్‌ అమ్మకాలు టాప్‌ 5 నుంచి టాప్‌ 3కి చేరుకున్నాయి” అని నైకా బ్రాండ్‌ అధికార ప్రతినిధి అన్నారు. లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆఫీసులకు మాస్కులు కంపల్సరీ కాబట్టి లిప్‌స్టిక్స్‌ సేల్స్‌ పెరిగే అవకాశం లేదని బ్రాండ్‌ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. లిప్‌స్టిక్స్‌ అనేవి మూడ్‌ ఎన్‌హ్యాన్సర్స్‌ అని ఎప్పిటికైనా వాటి అమ్మకాలు పుంజుకుంటాయని ఆశతో ఉన్నామని మరి కొందరు చెప్పారు.

Latest Updates