సుప్రీంను ఆశ్రయించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నిర్మాత

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్ లో నిలిపివేయడంపై… ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూసిని తర్వాత … తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది కోర్టు.

అయితే సినిమాలో వాస్తవాలనే చూపించామని తెలిపారు నిర్మాత రాకేశ్ రెడ్డి. సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చిన తర్వాత సినిమా‌ నిలిపివేయడం సరైంది కాదన్నారు. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. దీంతో నిర్మాత రాకేశ్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Latest Updates