మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణం డ్రామా!

నాగ్​పూర్: 40 వేల కోట్ల కేంద్ర ఫండ్స్​ను  ‘దుర్వినియోగం’  కాకుండా   చూడడానికే మెజార్టీలేకపోయినా మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా  దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని బీజేపీ ఎంపీ అనంత్​కుమార్​ హెగ్డే చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  హాట్​ టాపిక్​ అయింది.  అయితే  అనంత్​కుమార్​ కామెంట్స్​లో ఏమాత్రం నిజంలేదని ఫడ్నీవీస్​ సోమవారం కొట్టిపారేశారు.  నిధులు కావాలని కేంద్రాన్ని కోరడంగాని, వాటిని సెంటర్​కు మహారాష్ట్ర సర్కార్​ ​తిరిగి పంపేయడంగాని జరగలేదని మహారాష్ట్ర మాజీ సీఎం  సోమవారం  క్లారిటీ ఇచ్చారు.   అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్ని ‘రక్షించడానికే’  గతనెల మహారాష్ట్రలో పొలిటికల్​ డ్రామా జరిగిందని  కాంట్రవర్షియల్​ కామెంట్స్​కు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచే  కేంద్రమాజీ మంత్రి అనంత్​కుమార్​  శనివారం నోరు జారారు.

“ మా పార్టీకి చెందిన నాయకుడు మహారాష్ట్రలో  కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవీస్‌‌ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదనుకున్నారా ? మెజారిటీ లేదని మాకు తెలిసినా..  ఆయన ఎందుకు సీఎం అయ్యారు?  ప్రతి ఒక్కరూ ఇదే  ప్రశ్న అడుగుతున్నారు ’’  అని ఆయన ఉత్తర కన్నడలోని యెల్లాపూర్‌‌ అసెంబ్లీ  బైపోల్​ఎన్నికల ప్రచార సభలో  అన్నారు.

“ సీఎం కంట్రోల్​లో 40 వేల కోట్లపైగా నిధులుంటాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌‌, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ   డబ్బును అభివృద్ధి పనుల కోసం కాకుండా వేరే పనులకు మళ్లించి దుర్వినియోగం చేసేది. అందుకే పక్కా  ప్లాన్​తో  పెద్ద డ్రామాకు తెరతీశాం“అంటూ అనంత్​కుమార్​ కామెంట్స్​ను ఫడ్నవీస్​ తప్పుపట్టారు. హెగ్డే ఆరోపణల్లో నిజంలేదన్నారు.  ‘‘రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. ఇలా జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు.  స్టేట్​ ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఈ అంశంపై విచారణ జరిపి నిజాన్ని బయటకు తీయొచ్చు” అని ఫడ్నవీస్‌‌  వివరించారు.

Latest Updates