రీ కరెక్షన్ రిజల్ట్ ఆలస్యం.. సప్లిమెంటరీకి అప్లై చేసుకోండి

ఇంటర్మీడియట్ లో ఫెయిలైన విద్యార్థులకు ముందు జాగ్రత్త సూచనలు చేసింది రాష్ట్ర విద్యాశాఖ. దాదాపు మూడున్నర లక్షల మంది ఫెయిలైన విద్యార్థుల పేపర్ల రీ కౌంటంగ్, రీ వెరిఫికేషన్ ఉచితంగా చేస్తామని ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. ఐతే… ఆ ఫలితాలు మే 16 వరకు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 16 నుంచే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మొదలవుతాయి కాబట్టి.. ఎవరూ విద్యాసంవత్సరం నష్టపోకుండా.. ముందస్తుగా సప్లిమెంటరీ పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు.

పాస్ అయితే పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదనీ.. ఒక వేళ రీ వెరిఫికేషన్ లో మళ్లీ ఫెయిలైతే.. విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి… సప్లిమెంటరీకి ఫీజు కట్టి అప్లై చేసుకుంటే మంచిదని విద్యాశాఖ అధికారులు సూచించారు.

ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల ప్రకటనలో తప్పులు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాలపై నిన్న బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్… విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దని.. న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Latest Updates