ఆసరా గ్రీవెన్స్ ను పట్టించుకోని అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఆసరా లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన టోల్​ఫ్రీ నెంబర్​కు వందలాది కాల్స్ వస్తున్నాయి. నెలన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 768 కంప్లైంట్లు నమోదయ్యాయి. బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నంబర్​ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంలో మాత్రం అంత స్పీడ్​లేదని ఫిర్యాదుదారులు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్లలో కేవలం 106 ఫిర్యాదులనే అధికారులు పరిష్కరించారు. రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారుల్లో వృద్ధులు(12,86,363), వితంతువులు(14,52,545), వికలాంగులు(4,98,565) ఉన్నారు. పెన్షన్ అందుకోవడంలో  ఇబ్బందులొస్తే మండల కేంద్రానికి వెళ్లడం, అధికారుల చుట్టూ తిరగడం వారికి ఇబ్బంది. దీనిని తప్పించేందుకే ప్రతి జిల్లాలో టోల్​ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మొత్తం26 రకాల సమస్యలను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టుగా పది జిల్లాల్లో దీనిని చేపట్టింది. వచ్చే ఫిబ్రవరి నాటికి అన్ని  జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కంప్లైంట్ అందిన రెండు, మూడు రోజుల్లో వాటిని సాల్వ్ చేస్తామని అక్టోబరు 14న ఈ సేవలను ప్రారంభిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఈ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవన్నారు.

నిజామాబాద్​లోనే ఎక్కువ

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు అత్యధికంగా 346 వినతులు రాగా, మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో అత్యల్పంగా 2 మాత్రమే వచ్చాయి. మెదక్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు 96, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 71, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో 55, వరంగల్ అర్బన్‌‌‌‌‌‌‌‌ 53, వరంగల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ 50, నల్గొండ 37, ఖమ్మం 32, రంగారెడ్డి 26 కాల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. వీటిలో ఎంపీడీఓల వద్ద 630, డీఆర్‌‌‌‌‌‌‌‌డీఓల వద్ద 32 ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. కొత్త పింఛన్ల కోసం వచ్చిన 195 దరఖాస్తులు మొత్తం పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి.ః

 

Latest Updates