నకిలీ పోలీస్ కు దేహశుద్ధి

జార్ఖండ్: జంషెడ్ పూర్ లో ఏసీబీ అధికారి అని చెప్పుకుని మనీ వసూలు చేస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు బాధితులు. ఏసీబీ అధికారిగా చెలామణి అవుతూ… ఐడీ కార్డు చూపించి… పలువురి దగ్గర  లక్షల్లో నగదును వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఓ మహిళకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అతడి గురించి సదరు మహిళ ఆరా తీసింది. నకిలీ ఆఫీసర్ అని తెలుసుకుని… ఓ చోటికి రమ్మని చెప్పింది. మహిళ చెప్పిన చోటికి నకిలీ అధికారి కారులో చేరుకోగానే కర్రతో ఓ వ్యక్తి దాడి చేశారు. ఆ తర్వాత మహిళ కూడా వీపు విమానం మోత మోగించింది. మమ్మల్నే మోసం చేస్తావా అంటూ… మిగితా బాధితులు కూడా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర్నుంచి కారు, నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు

Latest Updates