ముఠా అరెస్ట్: వడ్డీ లేకుండా రుణాలంటూ మోసం…

వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఢిల్లీకి చెందిన సూరజ్ వర్మ, సోనూ శర్మ, జితెందర్ సింగ్ లె నోయిడా కేంద్రంగా… ఆన్ లైన్ లో రుణాలు ఇస్తామంటు జనాలను మోసం చేస్తున్నారు. ఇందులో బాగంగా.. హైదరాబాద్ ఖైరతాబాద్ కు చెందిన సాయినాథ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనుగొన్నారు సోనూ గ్యాంగ్. దీంతో పది లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇప్పిస్తామని సాయినాథ్ ను నమ్మించారు.

  ముందుగా రిజిస్ట్రేషన్, జీ ఎస్ టి చార్జీలు, 3నెలల అడ్వాన్స్ ఈ ఎమ్ ఐ ల పేరుతో 78 వేల రూపాయలు అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. త్వరలోనే నగదును బదిలీ చేస్తామని చెప్పారు. లోన్ కోసం చాలా రోజులనుంచి సాయినాథ్ ఎదురుచూసి… వాళ్లకు ఫోన్ చేయగా.. వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో పలుమార్లు ప్రయత్నించి.. తాను మోసపెయానని గ్రహించాడు సాయినాథ్. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి ల్యాప్ టాప్, చెక్కులు, సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Latest Updates