సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్ లో లూటీ

సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్ లో లూటీ

సీబీఐ అధికారులమంటూ కొందరు దుండుగులు ఓ ఇంటికి కన్నం వేశారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లిరు. ఈ ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి పీయస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీ లో భాగ్యలక్ష్మీ అనే మహిళ భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అయితే నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగ్యలక్ష్మీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దీంతో ఆమె తలుపు తెరిచింది. వెంటనే ఓ నలుగురు వ్యక్తులు హడావుడిగా ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. మేం సీబీఐ అధికారులం... మీ ఇంట్లో సోదాలు చేయాలి అంటూ బిల్డప్ ఇచ్చారు. వాళ్లు నిజమైన సీబీఐ ఆఫీసర్లే అనుకున్న భాగ్యలక్ష్మీ హడలిపోయింది. దీంతో ఆమె వద్ద ఉన్న లాకర్ కీస్ తీసుకున్నారు. లాకర్ లో ఉన్నకేజీ 35 తులాల బంగారం, లక్ష 70వేల నగదు ఎత్తుకెళ్లారు. దాదాపు గంటన్నర పాటు దుండగులు ఆమె ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులు ఉపయోగించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.