డాక్టర్‌నంటూ 20మంది యువతులకు ట్రాప్

విశాఖపట్నం: డాక్టర్‌నంటు యువతులకు లోబరుచుకుని వేధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం లోని కంచెరపాలేంలో జరిగింది. విశాఖలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు డాక్టర్ నంటూ 20 మంది యువతులను నమ్మించి లోబరుచుకున్నాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పాటే వారిని బెధిరించి పెద్ద ఎత్తున బంగారు నగలు, నగదును తీసుకున్నాడు. ఆ యువతుల స్నేహితులను కూడా తన లైంగికవాంచని తీర్చాలని ఒత్తిడి చేశాడు. అతని టార్చర్ ను భరించలేని ఓ బాధితురాలు నగర పోలీస్ కమీషనర్ ను ఆశ్రయించింది.   దీంతో నింధితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Updates