హనుమాన్ జంక్షన్లో నకిలీ ఐఏఎస్ అరెస్ట్

అమరావతి: హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఐఏఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ గా పనిచేసి రిటైరైన కె.సుజాతరావు పేరుతో కిలాడీ లేడీ పలువురు మహిళలను మోసం చేసినట్లు గుర్తించారు. ఆమె పేరు చెప్పి రకరకాల పేర్లతో పలువురు మహిళలు.. మహిళా సంఘాల నాయకురాళ్లను మోసం చేసినట్లు పలు ఆధారాలు లభించాయి. గతంలో  సుజాతరావు సర్వీసులో ఉన్నప్పుడు పలుమార్లు కలిసిన పరిచయంతో… ఆమె వద్దకు వచ్చే పలువురు అధికారులు.. అధికారిణులతో మాటా మంతీ జరుపుతూ..  చిరపరిచితురాలిగా మారింది. సుజాతరావు గురించి కొంత సమాచారం సేకరించి.. ఆమెతో సహాయం చేయిస్తానని చెబుతూ..  పలువురికి టోపీలు పెట్టింది. బాధితులు ఇచ్చిన సమాచారంతో కీలాడీ మహిళ విజయవాడకు చెందిన పెమ్మడి విజయలక్ష్మీ గా గుర్తించారు.

Latest Updates