సరిహద్దుల్లో చైనా మైక్రోవేవ్ వెపన్స్ వాడుతోందా?

న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బార్డర్‌‌కు ఇరువైపులా రెండు దేశాలు వేలాదిగా సైన్యాన్ని మోహరించాయి. ఉద్రిక్తతల తగ్గింపునకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదు. వీటిని పక్కనబెడితే.. ఇండియా సైన్యాన్ని ఓడించడానికి చైనా మైక్రోవేవ్ వెపన్స్‌‌ను వాడుతోందని ఓ చైనీస్ ప్రొఫెసర్ చెప్పడం సంచలనం రేకెత్తించింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ స్పందించింది. మైక్రోవేవ్ వెపన్స్ వాడుతున్నారనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈస్టర్న్ లడఖ్‌‌లో మైక్రోవేవ్ ఆయుధాలు వాడుతున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. ఇవి నిరాధారమైన ఫేక్ న్యూస్‌‌గా తన అధికార ట్విట్టర్ అకౌంట్‌‌లో ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చింది.

Latest Updates