మణప్పురం గోల్డ్ లోన్ లో నకిలీ నగలు

హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి చిన్న తోకట్టలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ సెంటర్ లోనకిలీ బంగారు ఆభరణాలు కలకలం సృష్టించాయి. సీఐ రాజేశ్ కుమార్ తెలిపిన వివరాలప్రకారం బోయిన్ పల్లి చిన్నతోకట్టలో ఉన్నమణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచి లో ఆడిటర్ శివారెడ్డి ఆడిటింగ్ చేస్తుండగా అందులో ఉన్నబంగారు ఆభరణాలు నకిలీవి అని తేలాయి. అనే ముణప్పురం ఏరియా హెడ్ కె విశ్వేశ్వర్ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లుతెలిపారు. గతంలో సిహెచ్ నాగరాజు బ్రాంచ్హెడ్ గా ఉన్నప్పుడు సూది గిరి సునీల్ కుమార్, నాగరాజు అనే వ్యక్తులు తరచు బంగారం పెట్టిగోల్డ్ లోన్ తీసుకుంటూ ఉండేవారని,అలాబ్రాంచ్ హెడ్ సీహెచ్ నాగరాజు తో పరిచయం ఏర్పరచుకొని 17 తులాల నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రూ.3.59 లక్షలు లోన్ తీసుకున్నట్లుతెలిపారు. విషయం తెలుసుకున్న బ్రాంచ్ హెడ్ విశ్వేశ్వర్ ,ఆడిటర్ శివారెడ్డిలు గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates