కేంద్రమంత్రి సంతకం ఫోర్జరీ : తెలంగాణ బీజేపీ నేతపై కేసు

p-muralidhar-rao-has-landed-in-a-controversy

కేంద్రంలో నామినేటెడ్ పోస్టులిప్పిస్తామని రూ. 2.10 కోట్లు వసూళ్లు చేయడంతో పాటు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ చెందిన మురళీధర్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో తొమ్మిది మందిపై మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలతో ఈ కేసులు నమోదు చేశారు. తాళ్ల ప్రవర్ణారెడ్డి ఫిర్యాదుతో నిందితులపై ..IPC 406, 420, 468తో పాటు 471,506, 156 (3) సెక్షన్ల కింద తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

మురళీధర్ రావు సన్నిహితుడైన కృష్ణ కిశోర్ BJP అగ్రనేతలతో తనకు సంబంధాలున్నాయని నమ్మించి, డబ్బులు వసూలు చేశారని ప్రవర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. మురళీధర్ రావుతో పాటు నిందితులుగా కృష్ణ కిశోర్, ఈశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, బాబా, శ్రీకాంత్, శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి.

Latest Updates