ఫేక్ న్యూస్.. నేను చనిపోలేదు: క్రికెటర్ సురేశ్ రైనా

తాను కార్ ఆక్సిడెంట్ లో చనిపోయానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా. ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లేంట్ చేశానని చెప్పారు. తనపై ఇలా ఫేక్ వార్తలు రావడంతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారని అన్నారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.

కొన్ని రోజులుగా తాను మీడియాకు దూరంగా ఉండడం, ఇంటర్ నేషనల్ క్రికెట్ లో కూడా  కనిపించకపోవడంతో.. కార్ ఆక్సిడెంట్ జరిందేమోనని కొందరు అనుకుంటున్నారని రైనా తెలిపారు. అయితే తనకు ఎలాంటి ఆక్సిడెంట్ జరుగలేదని చెప్పారు. అయితే ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం దారుణమని అన్నారు రైనా. “నేను కారు ప్రమాదంలో మరణించానని వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసిన వారిపై కంప్లేంట్ ఇచ్చాను. ఈ విషయంపై.. నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా బాధపడ్డారు”అని రైనా తెలిపారు.

Latest Updates