శ్రీముఖిపై తప్పుడు వార్తలు..పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : యాంకర్ శ్రీముఖిపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ పేపర్‌ పై ఆమె తల్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌ లో ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టే పోస్టుల ఆధారంగా పత్రికలో వార్తలు రాస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

ప్రస్తుతం బిగ్ బాస్-3లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న శ్రీముఖిని కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెపై తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీముఖి పలు టీవీ కార్యక్రమాలకు యాంకర్‌ గా పని చేసింది. సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించింది.

Latest Updates