బ్రాండ్ పేరుతో మోసం : కల్తీ కొబ్బరి నూనె

హైదరాబాద్ : కల్తీ..కల్తీ..కల్తీ..ఎం తినాలన్నా..ఎం వాడాలన్నా భయపడే పరిస్ధితి. తినే తిండి నించి ఆఖరికి వెంట్రుకలకు పెట్టుకునే కొబ్బరి నూనే డబ్బాలను కూడా వదలడంలేదు కల్తీ రాయుళ్లు. బ్రాండ్ చూస్తే సూపరు. క్వాలటీ మాత్రం లోఫరు. పైన పటారం..లోన లొటారం అనే విధంగా తయారు చేస్తూ..కస్టమర్లకు టోపీ పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. పారాష్యూట్ కొబ్బరి నూనె పేరుతో ఉన్న నకిలీ డబ్బాలను తయారు చేస్తున్నారు. అందులో కల్తీ నూనె పోసి అమ్ముతున్నారు. అచ్చం అదే బ్రాండ్. గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.

కుత్భుల్లాపూర్ లో గుట్టుచప్పుడుగా జరుగుతన్న ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ డబ్బాలను, పెద్ద మొత్తంలో నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.  స్పాట్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న కల్తీ మోసం చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు అధికారులు. ఈ  దాడుల్లో 5 లక్షల రూపాయల విలువచేసే కొబ్బరినూనె, ముడి సరుకు, ప్లాస్టిక్ డబ్బాలను విజిలెన్స్ స్వాధీనం చేసుకుందన్నారు.

ప్యారాష్యూట్ కంపెనీ చేసిన పిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ విజిలెన్స్ పక్కాగా స్కెచ్ వేసి దాడులు చేశారు.. విజిలెన్స్ దాడుల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి.. సుభాష్ జైన్ అనే వ్యక్తి గత 16 నెలలుగా సూచిత్ర చెర్మాస్ కంపెనీ సమీపంలో రెండంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని రోజు కూలీలతో విడి కొబ్బరి నూనెను ప్యారాష్యూట్ కంపెనీ లోగోతో ఉన్న డబ్బాలో నింపి బయటి మార్కెట్లో క్రయవిక్రయాలు జరిపేవాడు… ఇలా సుభాష్ జైన్ గత 16 నెలలుగా నకిలీ కొబ్బరు నూనెను విక్రయిస్తూ అక్రమంగా సొమ్ముచేసుకున్నాడు.. దాడులు చేపట్టిన విజిలెన్స్ సామగ్రి మొత్తాన్ని సీజ్ చేసింది.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest Updates