నకిలీ ప్యారాష్యూట్ ఆయిల్ తయారీ కేంద్రం పై విజిలెన్స్ దాడులు

కుత్బుల్లాపూర్ సూచిత్ర సమీపంలో ఓ నకిలీ ప్యారాష్యూట్ ఆయిల్ కేంద్రం పై హైదరాబాద్ విజిలెన్స్ దాడులు చేసింది.. ఈ దాడుల్లో సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే కొబ్బరినూనె, ముడి సరుకు, ప్లాస్టిక్ డబ్బాలను విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. ప్యారాష్యూట్ కంపెనీ చేసిన పిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ విజిలెన్స్ పక్కాగా స్కెచ్ వేసి దాడులు చేశారు.. విజిలెన్స్ దాడుల్లో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి.

సుభాష్ జైన్ అనే వ్యక్తి గత 16 నెలలుగా సూచిత్ర చెర్మాస్ కంపెనీ సమీపంలో రెండంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని రోజు కూలీలతో విడి కొబ్బరి నూనెను ప్యారాష్యూట్ కంపెనీ లోగోతో ఉన్న డబ్బాలో నింపి బయటి మార్కెట్లో క్రయవిక్రయాలు జరిపేవాడు… ఇలా సుభాష్ జైన్ గత 16 నెలలుగా నకిలీ కొబ్బరు నూనెను విక్రయిస్తూ అక్రమంగా సొమ్ముచేసుకున్నాడు.. దాడులు చేపట్టిన విజిలెన్స్ సామగ్రి మొత్తాన్ని సీజ్ చేసింది.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Latest Updates