తప్పుడు పోస్ట్ లు పెట్టిన 8 మందిపై కేసు

మల్యాల, వెలుగు: సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేసినందుకు ఎనిమిది మంది వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు మాల్యాల ఎస్ఐ ఉపేంద్ర చారీ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నందుకు రామన్నపేట గ్రామానికి చెందిన అల్లావుద్దీన్, ఆవేజ్, మహేందర్, గణేష్, సురేష్, చందు, రఘు, రఫిక్ ల పైన కరోనా వైరస్ వ్యాప్తి నిర్ములనలో భాగంగా ప్రభుత్వ జీవో 45 ప్రకారం వీఆర్ఓ రమేష్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదు సెల్ ఫోన్ లు సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest Updates