కెనడా ప్రధాని భార్యపై వైరలవుతున్న ఫేక్ వీడియో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడో లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్‌లో ఉన్నట్లు కెనడా ప్రధాని కార్యాలయం మార్చి 13, 2020న ప్రకటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సోఫీ ట్రూడోకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్న మహిళ కెనడా ప్రధాని భార్య సోఫీ ట్రూడో కాదని నిర్దారణ అయింది.

దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో ఒక మహిళ ముక్కుకు పైపులు ధరించి.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మాట్లాడుతుంది. ‘ఎవరైనా సిగరెట్ తాగేవాళ్లుంటే వెంటనే మానేయండి.. ఎందుకంటే మీ ఊపిరితిత్తులు మీకు చాలా అవసరం. అందుకే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను’ అని ఆ మహిళ తెలుపుతుంది. ఆ వీడియోకు కెనడా ప్రధాని భార్య అని ట్యాగ్ చేసి ఉంది. అయితే ఆ వీడియోలో ఉంది కెనడా ప్రధాని భార్య సోఫీ ట్రూడో కాదని.. ఆ మహిళ యూకేకు చెందిన తారా లేన్ లాంగస్టన్‌గా తేలింది.

తారా లేన్ లాంగస్టన్‌ మార్చి మొదటి వారంలో పశ్చిమ లండన్లోని హిల్లింగ్డన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. లాంగస్టన్ మరియు ఆమె తల్లి ఓ హోటళ్లో వెయిట్రెస్‌గా పనిచేస్తున్నారు. వారి సహోద్యోగులను హెచ్చరిస్తూ ఈ వీడియో వారికి వాట్సాప్‌లో పంపారు. ఆ వీడియోను ఆమె స్నేహితులు కెనడా ప్రధాని భార్య అని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బాగా వైరల్ అయింది. ఫేస్‌బుక్‌లో కెనడా వైఫ్ వార్న్స్ అని టైప్ చేస్తే ఈ వీడియో ప్రత్యక్షమవుతుంది.

కాగా.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడోకు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్లు చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటిస్తోందని కెనడా ప్రధాని కార్యాలయం తెలిపింది.

For More News..

కరోనాతో తిరుమల బంద్.. అయినా కొండపై పెళ్లిచేసుకున్న జంట

ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం.. ఉరిశిక్షను రద్దుచేయండి

నిత్యావసరాల కోసం రూ.1000 సాయం ప్రకటించిన యూపీ

కరోనా ఎఫెక్ట్: ఉద్యోగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కనికా కపూర్‌పై ‘కరోనా’ కేసు నమోదు

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

Latest Updates