ఆయిల్ ట్యాంకర్ యజమానులే వాళ్ళ టార్గెట్

fake-vigilance-officers-robbed-rs-8-lakh

విజిలెన్స్ అధికారులమంటూ ఆయిల్ ట్యాంకర్ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను SOT పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. కొన్ని రోజులుగా ఆయిల్ ట్యాంకర్ లను టార్గెట్ చేసిన అంతరాష్ట్ర ముఠా యజమానుల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసింది. పక్కా సమాచారం అందుకున్న భువనగిరి SOT పోలీసులు ..ఈ  దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి దగ్గరి నుండి రూ. 8 లక్షల 80 వేల నగదు, టాటా ఇండికా కారు, 8 మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

అనంతపురం జిల్లాకు చెందిన రెహ్మాన్ అనే ప్రధాన నిందితుడు ఆరుగురు సభ్యులతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఆయిల్ ట్యాంకర్ల ను టార్గెట్ చేసి ఈదోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యానం పేట్ సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్ ను ఆపి . రూ 6 లక్షల రూపాయాలు దోపిడీ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు.. భువనగిరి SOT టీం సహాయంతో నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన విచారణలో  మరో మూడు నేరాలతో వీరు సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు.

Latest Updates