నాపై లైంగిక ఆరోపణల వెనుక కుట్ర ఉంది: సీజేఐ

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఖండించారు.. ఆరోపణలన్నీ నిరాధారమని అన్నారు. ఇలాంటి చర్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రత ప్రమాదంలో పడుతుందన్నారు. సుప్రీంకోర్టులో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించాడని ఇతర జడ్జీలకు లెటర్లు రాశారు. ఆరోపణలపై గొగోయ్ నేతృత్వంలోనే ప్రత్యేక బెంచ్ ఏర్పాటై విచారణ జరిపింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని… ఈ కుట్రల వెనక పెద్ద శక్తులే ఉన్నాయన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడం సాధ్యం కాకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారన్నారు చీఫ్ జస్టిస్.

Latest Updates