370పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు : రాష్ట్ర న్యాయవాదులు

ఆర్టికల్ 370 రద్దుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర న్యాయవాదులు. ఇదే విషయంపై గురువారం తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు పలువురు న్యాయవాదులు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా చేసుకుని భారత్ జవాన్ల పై తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

పేస్ బుక్ సీఈవో జుకెన్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ ప్యాట్రిక్ డోర్ సే పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత మూకలకు కొమ్ముకాస్తున్న ట్విట్టర్, ఫేస్ బుక్ సీఈవోలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని తెలిపారు.ఫేక్ ఐడీలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. అమెరికాలో ఉంటూ భారత దేశ సర్వభౌమత్వం దెబ్బతీయలని చూస్తే ఉరుకోమని తెలిపారు లాయర్లు.

Latest Updates